నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాబా సాహెబ్ 134 జయంతి సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం 80 క్వార్టర్స్ లో పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మహిళలకు 33 శాతం పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. మహిళలకు ఓటు హక్కు విద్యా వైద్యం ఆరోగ్యం మహిళలు కూడా మగవారితో సమానంగా సమాజంలో సగంభాగం గుర్తింపు పొందాలని అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలు కూడా బయటకి వచ్చి మన మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఉంది అని మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కొంతమంది బ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు రేపు రానున్న రోజుల్లో పోరాటాలు చేయాల్సిన అవసరం వస్తే అందరూ కూడా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా నాయకురాలు మాధవి, ఐద్వా నాయకులు రేఖ, జ్యోతి, విమల, భాయ్ లతా, కవితా, సునిత, భూలక్ష్మి, లక్ష్మీబాయి, ఆశా బాయ్, శాలోబాయ్ తదితరులు పాల్గొన్నారు.
