బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన అపార కృషిని నాయకులు స్మరించుకున్నారు. అనంతరం షేక్ జుబేర్ మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగం లో...