బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన అపార కృషిని నాయకులు స్మరించుకున్నారు. అనంతరం షేక్ జుబేర్ మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగం లో ఆర్టికల్ 3 లో పొందపర్చారు. వారి స్పూర్తితోనే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించినం అని వారు తెలిపారు. యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ రైతు బందు అధ్యక్షులు అంజిరెడ్డి, కామారెడ్డి జిల్లా ఏ.ఐ.బి.ఎస్ ఉపాధ్యక్షులు బోడ రామ్ చందర్, బిఆర్ఎస్వి మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయి బాబా, కౌన్సిలర్ లు ఫెరోజ్ ఖాన్, ఖలీల్ ఖాన్, మాక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు అక్బర్, నాయకులు అతీఫ్ అజీమ్, ఇషాక్, రమేష్ యాదవ్, కృష్ణ, సాయులు, శేఖర్, సయ్యద్, ఉబెద్, షారు, అఫ్జల్, ఖాలెత్, సమీర్, రజ్జాక్, శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.