బతుకమ్మ,ఏర్గట్ల :మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పూర్ణనందం,మాజీ ఎంపీపీ ఉపేందర్ మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్‌కు దక్కుతుందని, అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌కే సాధ్యమైందని పేర్కొన్నారు.అంబేద్కర్ ఆలోచనల కోసం ఆయన ఆశయాల కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,బద్దం శ్రీనివాస్ రెడ్డి, కొలిపాక శ్రీనివాస్ రెడ్డి, రొక్కెడ మోహన్, జైనోద్దీన్, బద్దం హనుమాన్లు, లక్కం నరసయ్య, గన్నారపు రాజేశ్వర్, అట్ల పోశయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.