Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 8:06 pm Posted by : ramakrishna

గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

 

రుద్రూర్,  బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆర్ఎన్ సి కాలనీ, అంబేద్కర్ కాలనీల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్,  ఎస్సీ సంఘం అధ్యక్షులు పోతురాజు లింగం, శివశంకర్, ఉప సర్పంచ్ నిసార్, వార్డు సభ్యులు సాగరిక, గొర్ల కృష్ణ, వెంకటేశ్వర్లు, పోశెట్టి, వడ్ల నరేష్  తదితరులు పాల్గొన్నారు.