Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:56 pm Posted by : ramakrishna

బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు

 

రుద్రూర్,  బతుకమ్మ : 

 

రుద్రూర్ మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ పార్టీ శ్రేణులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు శివ ప్రసాద్, వినోద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఎముల గజేందర్, వడ్ల సాయినాథ్, బిజేవైఎం ఆశనాల గణేష్,   మోర్చా ఓబీసీ సతీష్ పవార్, కటిక రామరాజు, పార్వతి మురళి, చిదుర మైపాల్,  ధర్మారం వెంకటేష్, వంజరి శ్రీనివాస్, తెల్ల రవి, హరిరాము, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.