Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 2:41 pm Posted by : ramakrishna

జ్ఞానానికి ప్రతీక అంబేద్కర్

నిజామాబాద్, బతుకమ్మ :  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జ్ఞానానికి ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు పూలాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో నాయకులు, కర్తకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు, ఆకాంక్షాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని,0 ప్రతి పౌరుడు అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Ambedkar is the epitome of knowledge