Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2025, 6:09 pm Posted by : ramakrishna

ఘనంగా అంబరీశ్వర స్వామి ఉత్సవాలు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో అంబరీశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన అంబరీశ్వర స్వామిని ఆలయంలో దాతల సహకారంతో గ్రానైట్ రాయితో నిర్మించిన ఆలయం వందేళ్లుగా చెక్కుచెదరగా ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ కండక్టర్ రాజిరెడ్డి తెలిపారు. ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జంగం శివకుమార్, ప్రవీణ్ గ్రామ పురోహితులు రమేష్ జోషి, వేద పండితులు శ్యాంప్రసాద్ శర్మ, రాఘవేంద్ర శర్మతో పాటు ఇతర వేద పండితులు ఆధ్వర్యంలో వివిధ ఆత్మీయ కార్యక్రమాలు చేశారు.