అంబలి కేంద్రం ప్రారంభం

కోటగిరి, బతుకమ్మ: జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త పోల విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా అంబలి కేంద్రాని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోల రాఘవేంద్ర దీపి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏడాది అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పాషారాజు భారత్ తదితరులు పాల్గొన్నారు.