Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 3:49 pm Posted by : ramakrishna

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభం

బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో లయన్స్ భవనం వద్ద బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి రెండు నెలల పాటు  ఉచితంగా అంబిలి పంపిణీ చేస్తామని లైన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో  లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ  అధ్యక్షుడు దినేష్ పటేల్, సభ్యులు జీవన్, వంశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు