Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 4:24 pm Posted by : ramakrishna

అంబలి కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణంలో ప్రతి వేసవికాలంలో ప్రజల కోసం నిర్వహించబడుతున్న ఉచిత అంబలి కేంద్రం ఈ ఏడాది 25వ ఏటకు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమం సిల్వర్ జూబ్లీగా జరుపుకుంటోంది. ఈ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. ఈ అంబలి కేంద్రం మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందిస్తోంది. ప్రజాసేవ పట్ల అంకితభావంతో, రాజకీయ ప్రేరణను మించిన మానవతా విలువలతో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం వేలాది మందికి వేసవి కాలంలో ఉపశమనం కలిగిస్తోంది.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, “కుడుముల సత్యనారాయణ ప్రజల కోసం చేస్తున్న సేవ అభినందనీయం. ఈ తరహా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి,” అని అన్నారు. అంబలి కేంద్రం ద్వారా రోజూ వేలాది మంది కూలీలు, పేదలు, రాహదారి ప్రయాణికులు తమ దాహాన్ని శాంతించుకుంటున్నారు. ఆరోగ్యకరమైన తాగునీరు, పోషకమైన అంబలి అందిస్తూ సమాజంతో మమేకమవుతున్న ఈ కార్యక్రమం మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితవెంకట్రాం రెడ్డి, ఎల్లారెడ్డి మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళా అద్యక్షులు, పట్టణ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.