నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇంచార్జిగా అమంద్ విజయ్ కృష్ణ నియామకం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణని నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇంచార్జిగా నియమించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు బీజేవైఎం జిల్లా ఇంచార్జిలను గురువారం ప్రకటించారు. ఇందులో భాగంగా ఇందూరు జిల్లా కేంద్రానికి చెందిన అమంద్ విజయ్ కృష్ణ గతంలో బీజేవైఎంలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతను సంఘటితం...