నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణని నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇంచార్జిగా నియమించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు బీజేవైఎం జిల్లా ఇంచార్జిలను గురువారం ప్రకటించారు. ఇందులో భాగంగా ఇందూరు జిల్లా కేంద్రానికి చెందిన అమంద్ విజయ్ కృష్ణ గతంలో బీజేవైఎంలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతను సంఘటితం చేయడంలో కీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, “నన్ను నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇంచార్జిగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేయడానికి, యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేయడానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై, విద్యార్థులు, యువత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాను” అని అన్నారు.తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ అమంద్ విజయ్ కృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.