Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 5:19 pm Posted by : ramakrishna

బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బీజేవైఎం తెలంగాణ యువమోర్చా రాష్ట్ర కమిటీని మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటనలో జిల్లా నుంచి సీనియర్ నాయకుడైన ఆమంద్ విజయ్ కృష్ణ ని రాష్ట్ర కోశాధికారిగా నియమించారు. జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తూ, నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే విజయ్ కృష్ణ కి రాష్ట్ర స్థాయి బాధ్యత రావడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా పార్టీకి అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆయన, బీజేవైఎం డివిజన్ కార్యదర్శి స్థాయి నుంచి తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కృష్ణ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి, నా నియామకానికి కృషి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు కి, ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కి, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కి, శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ కి, పైడి రాకేష్ రెడ్డి కి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి కి, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ కి, బీజేపీ సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో బీజేవైఎం ఆధ్వర్యంలో మరిన్ని ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తానని ఆయన తెలిపారు.