అట్టహాసంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
వేల్పూర్, బతుకమ్మ తాము పదవ తరగతి చదివి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా 1999-2000 విద్యా సంవత్సరం కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ కార్యక్రమంను అట్టహాసంగా నిర్వహించుకొన్నారు. మండలంలోని రామన్నపేట్ మోటాడిరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం లో భాగంగా పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సమేతంగా వేదికపై తమ తమ పరిచయాలు చేసుకొని, వారి వారి సంతానం, వారిప్పుడు చేసే ఉద్యోగ, వ్యాపార,వాణిజ్య, వ్యవసాయ వృత్తులను గురించి ఒకరినొకరు చెప్పుకొన్నారు. చదివే సమయంలో వారి...