Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 2:20 pm Posted by : ramakrishna

అట్టహాసంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

వేల్పూర్, బతుకమ్మ

తాము పదవ తరగతి చదివి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా 1999-2000 విద్యా సంవత్సరం కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ కార్యక్రమంను అట్టహాసంగా నిర్వహించుకొన్నారు. మండలంలోని రామన్నపేట్ మోటాడిరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం లో భాగంగా పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సమేతంగా వేదికపై తమ తమ పరిచయాలు చేసుకొని, వారి వారి సంతానం, వారిప్పుడు చేసే ఉద్యోగ, వ్యాపార,వాణిజ్య, వ్యవసాయ వృత్తులను గురించి ఒకరినొకరు చెప్పుకొన్నారు. చదివే సమయంలో వారి విద్యాబ్యాసం, వారి అల్లరి చేష్టాలను గురించి ఒకరినొకరు చెప్పొకొని దినమంతా క్లాస్ మెంట్లు ఆనందంగా గడిపారు. అనంతరం విద్యను బోధించిన గురువులను కార్యక్రమానికి ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించి, సత్కరించారు. మరుపురాని ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పూర్వ విద్యార్థులు వారి వారి భార్య, భర్తలు, పిల్ల పాపలతో హాజరై కార్యక్రమాన్ని ఓ పండగల జరుపుకొన్నారు. అనంతరం పాతిక సంవత్సరాల తర్వాత కలిసి క్లాస్ మెంట్లు అందరు, ఉపాధ్యాయులతో కలిసి సహా పంక్తి భోజనం ను చేశారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు శ్రీరామోజీ రాములు, శంకర్, శ్రీనివాస్, నరేందర్, పండర్కర్ అమర్ రావు, క్యాతం సురేష్, రాజేశ్వర్, పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.