Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 June 2025, 8:37 pm Posted by : ramakrishna

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 2002 – 03 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తమ పాఠశాలలో కలుసుకున్నారు. చిన్ననాటి గుర్తులను విద్యార్థి దశలో చేసిన అల్లరి పనులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను శాలువాలో సన్మానించారు.