బతుకమ్మ : నాగిరెడ్డిపేట : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మండలంలో గోపాల్పేట్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల నందు 2005-06 విద్యా సంవత్సరంకి చెందిన పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు.20 సంవత్సరాల తర్వాత 2005-06 బ్యాచ్కి చెందిన 10వ తరగతి పూర్వవిద్యార్థులు కలుసుకున్న సందర్భంగా గత చిన్ననాటి జ్ఞాపకాలను ఓకే వేదికపై ఒక్కసారిగా అందరూ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.చిన్ననాటి కబుర్లను వారి యోగక్షేమాలను పాల్పంచుకున్నారు.అలాగే ప్రస్తుతము చేస్తున్న పనిని హోదాలను ఒకరినొకరు పూర్వ ఉపాధ్యాయులతో కలిసి పరిచయం చేసుకున్నారు.అనంతరం వారికి విద్యబోధన చేసినటువంటి గురువులకు పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు.కష్టసుఖాల్లో మనమందరం తోడుండి స్నేహ బంధాన్ని కలకాలం కొనసాగిద్దాం అన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భైరవ ప్రసాద్, సూరజ్ బిన్నీ,కిష్టయ్య,ప్రవీణ్ గౌడ్,షాబుద్దీన్,ప్రశాంత్, గోపాల్, ప్రేమ్ కుమార్,అశోక్ తదితరులు ఉన్నారు.