కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంఫరీద్ పేట్ గ్రామ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఫరీద్ పేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివిన 2009-10 సంవత్సరానికి గాను విద్యార్థులు రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. మధురమైన స్నేహబంధం మరపురానిది స్నేహబంధం సృష్టిలో అన్నిటిని మించిన అందరిని అలరించే బంధం స్నేహబంధం మనుషుల వీడి దశబ్దం గడిచినది. అని గుర్తు చేసుకొని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి మాట్లాడారు.ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో గుంజేడు దేవాలయ అవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరీద్ పేట్ జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో 2009-10విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది. దశబ్దాల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు కొందరు, ఎక్కడెక్కడో స్థిర పడిన వారు కొందరు, ఉద్యోగాల్లో కొందరు, సహదర్మచరినిలుగా కొందరు, వివిధ స్తితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలనేకలంపులో ఆనాటి విద్యార్థులైన కొంత మంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు గుంజేడు దేవాలయ ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
