Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 5:41 pm Posted by : ramakrishna

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చంద్రశేఖర్ కాలనీ చదువుకున్న 2007 – 08 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు సమక్షంలో ఉపాధ్యాయుల మద్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2007 – 08 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు అందరూ ఒకచోట చేరి వారికి విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. అంతేకాకుండా విద్యార్థులు విద్యను అభ్యసించి సమయంలో చేసిన చిలిపి పనులను, అల్లరి పనులను గుర్తుచేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉపాధ్యాయులు బోధించిన మంచి అంశాలను అనుభవాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల కు శాలువాలు కప్పి మెమేంటోలు అందించి సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో ఆటలు, పాటలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించుకుని ఆనందాలను పంచుకున్నారు. అంతేకాకుండా ఆత్మీయ సమ్మేళనంలో గుర్తుగా  ఉపాధ్యాయుల చేత పూర్వ విద్యార్థులకు మేము తోనే బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ ఉపాధ్యాయులు పండరి,  సుజాత, రజిని, మీనా, జ్యోతి, ఆనంద్ రావు,  లింబాద్రి, ప్రకాష్, పూర్వ విద్యార్తులు పాల్గొన్నారు.