పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ కాకతీయ జూనియర్ కళాశాల 2002 2004 సిఇసి బ్యాచ్ విద్యార్థులు నో ప్లాస్టిక్ తో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకుండా మోదుగ ఆకులు తో తయారుచేసిన ప్లేట్స్, జొన్న వ్యర్ధాలతో తయారు చేసిన గ్లాసెస్, బ్యానర్ ప్లాస్టిక్ తో కాకుండా క్లాత్ బ్యానర్ ఇలా పర్యావరణానికి హాని కలిగించకుండా విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.