పూర్వ విద్యార్థుల సమ్మేళనం

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పల్లికొండ హై స్కూల్ లో 1998-97 విద్యా సంవత్సరం లో పదవ తరగతి చదివిన విద్యార్థులు 28 సంవత్సరాల తర్వాత అందరు కలిసి అపూర్వంగా, అపురూపంగా తమ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంను నిర్వహించుకొన్నారు. పూర్వ విద్యార్థులు మాణిక్యాల శ్రీనివాస్ అధ్యక్షతన, చెవున గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమ్మేళనం కార్యక్రమం లో భాగంగా  ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, శ్రీ సరస్వతి మాత పూజను నిర్వహించారు. తమకు విద్యా భోధన చేసి కాలం చేసిన ఉపాధ్యాయులను...