Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 4:28 pm Posted by : ramakrishna

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పల్లికొండ హై స్కూల్ లో 1998-97 విద్యా సంవత్సరం లో పదవ తరగతి చదివిన విద్యార్థులు 28 సంవత్సరాల తర్వాత అందరు కలిసి అపూర్వంగా, అపురూపంగా తమ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంను నిర్వహించుకొన్నారు. పూర్వ విద్యార్థులు మాణిక్యాల శ్రీనివాస్ అధ్యక్షతన, చెవున గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమ్మేళనం కార్యక్రమం లో భాగంగా  ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, శ్రీ సరస్వతి మాత పూజను నిర్వహించారు. తమకు విద్యా భోధన చేసి కాలం చేసిన ఉపాధ్యాయులను స్మరించుకొని వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం విద్యార్థులు వారి వారి  పరిచయం చేసుకొని ఒక్కొక్కరుగా వారి వారి పాత జ్ఞాపకాలను చెప్పుకొంటూ, వారి వ్యాపార, ఉద్యోగ, కుటుంబ వ్యాపకాలను చెప్పుకొన్నారు. ఉపాధ్యాయులు తమ ఉపన్యాసాలను ఇచ్చారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు లైవ్ లో పాల్గొనగా వీరి బ్యాచ్ కు చెందిన నరేష్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ఉద్యోగం సాధించిగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో పూర్వ ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు, ఉపాధ్యాయులు మోహన్, జయచంద్, శ్రీనివాస్, నర్సయ్య, బాలరాజ్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Alumni Association