Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2024, 3:14 pm Posted by : ramakrishna

రూ.45 లక్షల విలువైన అల్ప్రాజోలం పట్టివేత

బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బుధవారం దాడులు చేసింది. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ, ఇన్ స్పెక్టర్లు పక్కా సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జాము నుంచి బోధన్ పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతడి వద్ద నుంచి 4కిలోల 300 గ్రాముల నిషేధిత అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్ లో రూ.45 లక్షలు ఉంటుంది. దాడుల్లో ఒకరు పట్టుబడగా, మరికొందరి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. అల్ఫ్రాజోలంను కృత్రిమ కల్లు తయారీకి ఉపయోగిస్తారు. బోధన్ సబ్ డివిజన్ లో రేషన్(ఈత, తాటి చెట్లు)లేకపోవడంతో కల్లు స్థానంలో నిషేధిత మత్తుపదార్థాలను కలిపి కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కల్తీ కల్లు తయారు చేసేందుకే అల్ప్రాజోలం తీసుకువచ్చినట్లు తెలిసింది.