బోధన్, బతుకమ్మ : బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బెలాల్ గ్రామంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముస్తాబాద్ వీరాగౌడ్ ఇంటిలో 264 గ్రా. అల్ప్రాజోలం (Xanax) స్వాధీన పరుచుకొని, నిందితుడిని, నిషేధిత ఉత్ప్రేరకాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన్ ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించినట్లు సీఐ స్పప్న తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ ఐ లు నరసింహాచారి, బి. రామ్ కుమార్, రాజన్న, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ రామ్ బచ్చన్, గంగారాం మరియు సాయి కుమార్లు పాల్గొన్నారు.