Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 4:36 pm Posted by : ramakrishna

ఆటలతో పాటు మహిళలు పోరాటాలకు సిద్ధం అవ్వాలి

  • పివోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.సత్తేవ్వ పిలుపు
  • పివోడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు

 

సిరికొండ, బతుకమ్మ : ఆటలతో పాటు మహిళలు పోరాటాలకు సిద్ధం అవ్వాలని ప్రగతి శీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు వి.సత్తేవ్వ పిలుపు నిచ్చారు. సిరికొండ మండలలోని గడ్కోల్ గ్రామంలో ఆదివారం ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) మండల కమిటీ ఆధ్వర్యంలో మహిళకు పలు క్రీడలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రగతిశీల మహిళా సంఘం ( పివోడబ్ల్యూ ) జిల్లా ఉపాధ్యక్షురాలు వి.సత్తేవ్వ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో వివక్షతకు గురవుతున్నారని, ఐక్యత లేక సమాజంలో అన్ని రంగాల్లో వెనకబడి  అసమానతలు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం క్రింద ఇస్తానన్న రూ.2500/- లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీ, కుర్చీ పోటీలు. భీడీలు చుట్టుట పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ రమ,మండల నాయకులు ఆర్.పుష్పలత, జి.పద్మ, బి.మానస, ఇ.జమున, ఎస్.గంగామణి, ఏ.లత, బి. లావణ్య, టి. రామాగంగు, టి. గంగామణి, పి.రాజమణి, కె.మణెమ్మ, జె.అరుణ, ఎ.లలిత, ఎ.సావిత్రి, బి. విజయ, తదితరులు
పాల్గొన్నారు.