Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 4:50 pm Posted by : ramakrishna

క్రమశిక్షణతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలి

  • జిల్లా విద్యాధికారి అశోక్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులు శిక్షణతో పాటు రామకృష్ణుడు, శారదా మాత, వివేకానందుని సూక్తులను మంచి నడవడికను అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి అశోక్ సూచించారు. రామకృష్ణ సేవా సమితి నిజాంబాద్ ఆధ్వర్యంలో గత నెల 24 ఏప్రిల్ నుండి ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరం  ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమం రామకృష్ణ వివేకానంద ధ్యాన మందిరంలో గంగా స్థానం పేస్టులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి పార్సి అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామకృష్ణ సేవా సమితి వేసవి శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నందుకు అభినందించారు. వివేకానందుడి బోధనలో లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించకు అనే దాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మండలాలలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. గౌరవ అతిథిగా స్వామి తపతానంద జి రామకృష్ణ హైదరాబాద్ మాట్లాడుతూ ఈ నెల రోజులు కూడా సంస్కార్ వేసవి శిక్షణ హాజరైన విద్యార్థులు వివిధ అంశాల్లో శిక్షణ పొంది  విద్యార్థులు విన్యాసాలను ప్రదర్శనలను అద్భుతంగా ప్రదర్శించారన్నారు. యోగ, డ్రాయింగ్, కరాటే, మ్యూజిక్, వేదిక్ మాథ్స్, నాట్యము వివిధ అంశాల్లో మీ శక్తినంతటిని కూడా కూడగట్టుకుని శిక్షణను తీసుకున్నారని తెలిపారు. ఈ శక్తిని మీకు ఆ రామకృష్ణుడు వివేకానందుడు అందించాడని, దానిని మన నిజజీవితంలో కూడా ఆచరించాలని, ఆ విధంగా  తల్లిదండ్రులు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ లో జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్ (వ్యవస్థాపక కార్యదర్శి రామకృష్ణ సేవ సమితి) వీరిని స్వామీజీ,  సమితి సభ్యులు సన్మానించారు. నెల రోజులు శిక్ష ఇచ్చినటువంటి ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్ రాష్ట్ర మాజీ కన్వీనర్ బావ ప్రచార పరిషత్ రామకృష్ణ మట్ హైదరాబాద్, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సాయి ప్రసాద్, ఉపాధ్యక్షులు యోగ రామచందర్, కార్యదర్శి బొచ్చు గోపాల్ ,వ్యవస్థాపక కార్యదర్శి తోట రాజశేఖర్, యువ విభాగ్ కన్వీనర్ వసంత్ పాటిల్ ,సభ్యులు దీపక్ ,నాయక్, వినోద్, స్వరూప్, నర్సయ్య ,గంగా ప్రసాద్, టీచర్స్ వినోద్, శ్రీనివాస్, శ్రీలేఖ, రమేష్ ,హనుమాన్లు వేసిన వేసవి శిక్షణ శిబిర ఇంచార్జ్ రాజేంద్రప్రసాద్ ,సభ్యులు రాజ్ కుమార్ సుబేదార్, సేవా సమితి సభ్యులు శిక్షణ విద్యార్థులు 128 మంది మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Along with discipline, good manners should be cultivated.