Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 4:46 pm Posted by : ramakrishna

అన్నిదానాల కన్న అన్నదానం గొప్పది

  • బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్నిధానాల కన్న అన్నదానం గొప్పదని బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి అన్నారు. గుమస్తా కాలనీ శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయం నందు గణేష్ నవరాత్రుల సందర్బంగా అన్నదానం నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో హోమం, అమ్మవారి అభిషేకం, గణపతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బార్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్నిధానాల కన్న అన్నదానం చేయడం చాలా సంతోషం అన్నారు. నగరం లో ఎక్కడ చుసిన గణేష్ ఉత్సవాలు భ్రమండంగా జరుగుతున్నాయి అన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడాలని అన్నారు. అమ్మవారి ఆలయానికి రాగానే ఒక మధుర ఆనుభూతి లభిస్తుంది అన్నారు. దుర్గాదేవి ఆలయానికి అన్ని విధాలా సహకరిస్తా అని వారు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి ని సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధ్యక్షులు ఆమందు విజయ్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి బోడికే బాబురావు కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదశివా, గౌరవ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షలు గంగోనె అనిల్, కిషన్, కార్యదర్శి అమందు రాజేష్, అమందు వెంకటేష్, ధాత్రిక రాజేందర్,గంగోనె శ్రీనివాస్, ధాత్రిక ప్రవీణ్,గణేష్ కమిటీ ప్రధాన కార్యదర్శి అఖిల్ రాజ్, హరీష్, శివ కుమార్,కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Almsgiving is greater than all other gifts.