గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 1,248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం విజేతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప-2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు, ఉత్తమ చిత్రాలుగా కల్కి తో పాటు మరో రెండు సినిమాలను అవార్డులు వరించాయి. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన చిత్రాలను పరిగణలోనికి తీసుకున్నారు. జూన్ 14న ఈ అవార్డులను అందజేయనున్నారు.
ఎంపికైన సినిమాల జాబితా
బెస్ట్ ఫీచర్ : కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్
ఉత్తమ సామాజిక చిత్రం : కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్నకథ కాదు
ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ : రజాకార్
ఉత్తమ నూతన దర్శకుడు : ఎదు వంశీ
హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ : ఆయ్
వ్యక్తిగత విభాగంలో
ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి : నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
బెస్ట్ సపోర్టింగ్ నటుడు : ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
బెస్ట్ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
బెస్ట్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
బెస్ట్ కమెడియన్స్ : వెన్నెల కిషోర్, సత్య
ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్).
