Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 9:55 am Posted by : ramakrishna

అల్లు అరవింద్ కి మాతృ వియోగం

హైదరాబాద్, బతుకమ్మ :  అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అల్లు రామలింగయ్య భార్య కనక రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంది. కనకరత్నమ్మ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి తరలిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన నివాసం మధ్య భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్ షూటింగ్ నిమిత్తం మైసూర్, ముంబైలో ఉన్నారు. మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.