నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల ఉనికిని కాపాడే విధంగా న్యాయబద్దంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉండాలని డిటియూ జిల్లా నాయకులు అన్నారు. డీటీయూ ఆధ్వర్యంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారికి సోమవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఈనెల 20న సీ అండ్ డిఎస్ఈ నుండి వెలువడిన ఉత్తర్వులలో పేర్కొన్న విషయాలు చాలా అసంబద్ధంగా ఉన్నాయన్నారు. ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ అంశాలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటీయూ జిల్లా ప్రతినిధులు రమేష్, రాజు పాల్గొన్నారు.