భూకమతాలకు భూదార్ సంఖ్య కేటాయింపు
ఏటా భూ రికార్డుల ఆధునీకరణ రైతులకు ఉచిత న్యాయ సేవలు భూభారతి చట్టం అవగాహన సదస్సులలో కలెక్టర్ వెల్లడి నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి (ఆర్.ఓ.ఆర్ - 2025) నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా...