Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 4:09 pm Posted by : ramakrishna

ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతనే లేదు

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతనే లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెత్తబుట్టలో వేశారని ఆరోపించారు. ‘రాజీవ్ యువ వికాస్’​ పథకం పెద్ద మోసమని, గారడీ అంకెలతో మళ్లీ మోసం చేసిందన్నారు.  రూ. 3లక్షల60 వేల కోట్ల బడ్జెట్లో రూ.60వేల కోట్లు కమిషన్ల రూపంలో మాయమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకొన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను చెత్తబుట్టలో పడేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతులను మహిళలను – విద్యార్థులను -నిరుద్యోగులను – యావత్ తెలంగాణ జనులను మోసం చేసింది అన్నారు. గృహజ్యోతి వెలుగులు లేవు,రైతు భరోసా – పైసల్ లేవు,ఇందిరమ్మ ఇండ్లు – ఐదులక్షలు రాలే – ఇంటి జగ జాడలేదు అని అన్నారు.చేయుత – పింఛన్ పెరిగింది లేదు యువ వికాసం – నయా మోసం అని తెలిపారు, మహా లక్ష్మీ – పథకం ప్రస్తావనే లేదు పైసల్ ఎకౌంట్ల పడలేదు అని మండిపడ్డారు, కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా .. మోసాలు. గత ప్రభుత్వం గారడీ మాటలతో మోసం చేస్తే వీళ్ళు గారడీ అంకెలతో మోసం చేస్తున్నారు అనితెలిపారు. 17 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన లేదన్నారు. 10లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ కుంటుపడిందని, ఆరోగ్యశాఖకు 8 శాతానికి బదులు 4 శాతం కేటాయించడంతో పేదలు వైద్యానికి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. 52 శాతం ఉన్న బీసీ ల సంఖ్యను కులగనణ ద్వారా తగ్గించారని ధన్​పాల్​ విమర్శించారు. రూ. 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిన విషయం స్వయానా సీఎం రేవంత్ రెడ్డి  చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం​ అధికారంలోకి రాగానే 16 నెలల కాలంలో రూ. లక్షా 60వేల కోట్లు చేసిందని మండిపడ్డారు. మహిళా సశక్తికరణ మరియు మహాలక్ష్మి పథకం నిధులు ఎక్కడ,మహిళలని కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం ఏమి చేసింది, మహాలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రస్తావన లేదు, తాజా బడ్జెట్లో కూడా ఈ పథకం పక్కకు పెట్టారు అని అన్నారు. అంబేద్కర్ అభయహస్త పథకం నిధులు ఎక్కడ?, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులతోపాటు గిరిజనులకు సైతం రూ.12 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తామని ప్రకటించిందిఅని,తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో దాని ప్రస్తావనే లేదు అని తెలిపారు.  ప్రభుత్వం పింఛన్ పెంపుకు నిధులు ఎక్కడ అని అన్నారు, చేయూత పథకం కింద కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల కు పెన్షన్ పెంచుతామన్నారు , కాంగ్రెస్ పెంచే వాగ్దానాలు ప్రకారం 27 వేల కోట్లు అవసరం కానీ 14,861 కోట్లు మాత్రమే కేటాయించింది అన్నారు, కొత్తగా 10 లక్షల పింఛన్దారులకు పెన్షన్ ఎలా అందిస్తారో అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నేలం రాజు, తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, మండల అధ్యక్షులు తారక్ వేణు, గడ్డం రాజు, భూపతి, నాగరాజు, తాజా మాజీ కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, కిషోర్ ఇప్పకాయల, శ్రీధర్ పంచారెడ్డి, ఇల్లందుల ప్రభాకర్, సాయి వర్ధన్, ముత్యాలు, బీజేపీ నాయకులు, పుట్ట వీరేందర్, చిన్న కారి నరేష్, మఠం పవన్,భాస్కర్, పవన్ ముందడ, వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.