పాత విద్యాశాఖ కార్యాలయాన్ని కోర్టుకు కేటాయించండి
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ వినతి బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత విద్యా శాఖ కార్యాలయంతో పాటు స్థలాన్ని జిల్లా కోర్టు అవసరాల నిమిత్తం కేటాయించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ విన్నవించింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేపూల జగన్ మోహన్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజెందర్ రెడ్డి,బార్ ఉపాధ్యక్షుడు రాజు,కోశాధికారి దీపక్, సీనియర్ న్యాయవాదులు మంచికంటి గోవర్ధన్, ఆకుల రమేష్,రాజేశ్వర్ రెడ్డి,...