కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల 22వ ప్యాకేజీకి నిధులు కేటాయించాలని ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు నీటిపారుదల రంగంపై సమీక్ష నిర్వహిస్తున్నందున 22వ ప్యాకేజీ పూర్తి చేసి మెట్ట ప్రాంతమైన ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.22 ప్యాకేజ్ లో భాగంగా బొంపల్లి చెరువు పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల బీసీ నాయకుడు కళాలి సాయ గౌడ్ చాకలి లింగం,సంకిలింగం తదితరులు పాల్గొన్నారు.