ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నిధులు కేటాయించండి

మంత్రి సీతక్కను కోరిన  ఎమ్మెల్యే మదన్ మోహన్  రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం రూ.244కోట్ల  నిధులు కేటాయించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కోరారు. తెలంగాణ సెక్రటురియట్ లో సోమవారం రాష్ర్ట పంచాయతీ రాజ్ శాఖ  మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అంగన్ వాడీ నిధులు, నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, తండా, గ్రామాలలో రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం రూ.244కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.