Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 7:41 pm Posted by : ramakrishna

వ్యక్తిగత కక్షలతోనే ఆరోపణలు

  •  విలేకరుల సమావేశంలో జూకంటి మోహన్ రెడ్డి

 

బతుకమ్మ, రాజంపేట:  వ్యక్తిగతంగా తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు కక్ష సాధింపులకు పాల్పడి తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని రాజంపేట గ్రామ పెద్దలు జూకంటి మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు,  ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ లకు తనపై కొంతమంది ఫిర్యాదు చేశారని వారిని తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, ముత్యపు సిద్ధి రాములు, మీ ఆస్తులు మొత్తం సర్వే చేసి ప్రజల ముందు ఉంచాలని, చెరువులను కబ్జా పెట్టి చేపల చెరువులు గా మార్చిన ఘనత మీదేనని అన్నారు. మామూలు పేద ప్రజలకు బస్టాండ్ లో కోకలు కట్టించే విషయంలో నాటి సర్పంచ్ సిద్ధిరాములు మీద కోర్టు స్టే తీసుకొచ్చి రాజంపేట అభివృద్ధిని అడ్డుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. నకిలీ సిమెంట్ తో వ్యాపారం చేస్తున్న నీవు నీ సిమెంట్ పై త్వరలోనే నీ బండారం బయటపెడతామని హెచ్చరించారు. జూకంటి వంశం పేద ప్రజలకు అండగా ఉంటుందని ఎక్కడ అన్యాయం జరిగినా తాను ముందుండి వారికి అండగా ఉంటానని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆరోపణలు చేస్తున్నారని చట్టం ఎవరికి చుట్టం కాదని తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. మరోసారి తనపై అభండాలు మోపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.