మోర్తాడ్,బతుకమ్మ: ఇందిరా ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12వేలు వ్యవసాయ కూలీలందరికి ఇచ్చి అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు జి.కిషన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12వేలు వ్యవసాయ కూలీలందరికి ఇచ్చి అమలు చేయాలని, మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేసి మోర్తాడ్ తహసీల్దార్ కృష్ణ కు సమస్యలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు జి.కిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల హామీగా 12 వేల రూపాయలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలికి 12 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అతిలేదు గతి లేదు అని ఆవేదన వ్యక్తం చెశారు. వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించారన్నారు. తన ఎన్నికల హామీని తుంగలో తొక్కారని,గంపెడు ఆశతో ఓట్లు వేసి గెలిపించిన వ్యవసాయ కూలీలకు హామీని అమలు చేయకుండా మొండి చేయి చూపారన్నారు. వ్యవసాయ రంగంలో ఆ ఇ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలను ప్రతి కార్మికుడికి వెంటనే ఇవ్వాలని లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం అని హేచ్చరించారు. ఈకార్యక్రమంలో దయాల్ సింగ్, ధోన్ పాల్ మాజీ సర్పంచ్ గంగ పోసాని,పద్మ , భూమగంగు, డాక్టర్ శీను, పోశెట్టి, నాని, దశరథ్, సలీమా, లక్ష్మి, అంజలి, రుకుంబాయ్, మోర్తాడ్ మండల వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.