ఓటర్లు అందరూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయించుకోవాలి

  . . . నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఓటరు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఓటరు జాబితాను సమగ్రంగా పరిశీలించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా ఇప్పుడు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారని...