Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 7:36 pm Posted by : ramakrishna

సికింద్రాబాద్ యశోధలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో 

 

. . . ప్రముఖ వైద్యులు సుమంత్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రస్తుతం క్యాన్సర్ రోగులకు అనేక రకాల క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని, అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి  ప్రముఖ వైద్యులు సుమంత్ కుమార్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్ లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆన్కాలజిస్ట్, హెమటాలజీ ప్రముఖ వైద్య నిపుణులు సుమంత్ కుమార్ మల్లుపట్టు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స విధానాలు అందరికీ ఒకే విధంగా అవసరం ఉండదని వైద్యులు వెల్లడించారు. ప్రతి వ్యక్తి పరిస్థితిని బట్టి చికిత్స నిర్ణయించబడుతుందన్నారు. చికిత్స ముఖ్య ఉద్దేశాలు క్యాన్సర్‌ను పూర్తిగా నియంత్రించడం లేదా తగ్గించడం, రోగి జీవిత నాణ్యత (క్వాలిటీ అఫ్ లైఫ్) మెరుగుపరచడం, చికిత్స వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడం, అవసరమైన చికిత్సను తగ్గించకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ను మినిమైజ్ చేయడం, ఆధునిక టెక్నాలజీ ప్రయోజనాలని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హైలీ అడ్వాన్స్డ్, కొత్త టెక్నాలజీ రేడియేషన్ మెషిన్  హైపర్ సైట్ ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ కొత్త ట్రీట్మెంట్ పద్ధతుల వల్ల క్యాన్సర్ రోగులకు మరింత ప్రయోజనం కలిగిస్తోందని సుమంత్ కుమార్ స్పష్టం చేశారు. రేడియేషన్ ట్రీట్మెంట్ ప్రత్యేకతలు క్యాన్సర్ ఉన్న భాగాన్ని మాత్రమే టార్గెట్ చేసి చికిత్స చేయడం వలన చుట్టూ ఉన్న మామూలు కణజాలానికి నష్టం తక్కువగా ఉంటుందని ప్రముఖ వైద్యులు స్పష్టం చేశారు. చికిత్స చాలా ఖచ్చితంగా ప్రేసిషన్ గా ఇవ్వబడుతుందని అన్నారు. యశోద మెడికల్ సెంటర్ నిజామాబాద్ లో ప్రతి నెల మూడవ శుక్రవారం తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆహార అలవాట్ల వల్లే క్యాన్సర్ వ్యాధులు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. మద్యం సేవించడం, పొగాకు తో పాటు కాలుష్యం వల్ల  వంశపారంపర్యంగా క్యాన్సర్ సోకుతుందన్నారు. దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించే విధంగా యశోద ఆసుపత్రిలో ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.