Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 7:19 pm Posted by : ramakrishna

వాణిజ్య, వ్యాపార వర్గాలన్ని బంద్ కు సహకరించాలి

భీమ్ గల్, బతుకమ్మ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం, బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థల వారు అన్ని వర్గాల వారు సహకరించాలని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం మండల పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42%బీసీల రిజర్వేషన్ గవర్నర్ ఆమోదించి, కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో పెట్టి చట్టం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ బంద్ పురస్కరించుకొని పట్టణ కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల వారందరు బంద్ కు సహకరించాలని కోరారు. ప్రెస్ మీట్ అనంతరం పార్టీ నాయకులందరు పట్టణంలో బైక్ లపై తిరుగుతూ అందరు బంద్ పాటించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ప్రెస్ మీట్ లో పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.