- – ఏ.ఐ.ఎస్.బీ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ : : తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లు,కేజీవీబీ హాస్టళ్ల నిర్వహణ చాలా అద్వానంగా తయరయ్యయాని,విద్యార్థుకు కనీస రక్షణ కరువైందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టలల్లో విద్యార్థులకూ జ్వరాలు వచ్చిన వారి ఆరోగ్యాలు బాగాలేకున్నా కనీసం పట్టించుకునే వారే దిక్కులేరని, వారు తినే అన్నంలో పురుగులు, బొద్ధింకలు, బల్లులు,
కప్పలు రోజుకో హాస్టళ్ళల్లో వస్తున్నా సంఘటనలు చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. సరిపడా గదులు, నీరు, బాత్రూంలు లేకపోవడం, ఉన్న వాటిని ప్రతి రోజు శుభ్రం చేయకపోవడం వలన విద్యార్థులు చాలా అవస్థలకు గురవుతున్నారన్నారు. డెంగ్యూ, మలేరియా,టైపాడ్ జ్వరాలు వస్తే కనీసం ట్యాబ్లేట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పూడ్ పాయిజాన్ అయ్యి హాస్పిటలల్లోకి విద్యార్థులు చేరితే మళ్ళీ తిరిగి హాస్టళ్ళల్లోకి వస్తారా?.. రారా అనే భయందోళనలలో విద్యార్థుల తల్లి,తండ్రులు ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హాస్టలల్లో ఉండే విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని, మరణ మృదంగాలుగా, చావు డప్పుల మొతలుగా అయితున్నాయని, బుక్కెడు బువ్వకోసం అమ్మ ఓడిని విడిచి హాస్టలల్లో ఉండి ఆసుపత్రుల పాలు అవుతున్న కనీసం స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. గత నేలలో గురుకుల హాస్టళ్ళల్లో ఐదుగురు విద్యార్థులు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితులల్లో లేదు. అంటే పేద మధ్యతరగతి విద్యార్థుల ప్రాణాలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వనికి కొద్దిగా అయినా పట్టింపులేదూ అనే విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. ఇట్టి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారించి చనిపోయిన విద్యార్థుల తల్లీ,తండ్రుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.