Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 5:01 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల లో ఉపాధ్యాయులందరు నమోదు చేసుకోవాలి

  • రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పాప గారి రామ కృష్ణ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : వచ్చే ఎంఎల్సీ ఎన్నికల లో ఉపాధ్యాయు లందరు తమ పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పాప గారి రామ కృష్ణ రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 317 జీ.ఓ ప్రకారం ఉపాధ్యాయులకు వారి సొంత జిల్లాకు పంపాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరలీ కృష్ణ వేణి, భట్టు బద్రినాథ్ రాష్ట్ర బాధ్యులు వర ప్రసాద్ ,కీర్తి సుదర్శన్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.