Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2025, 2:43 pm Posted by : ramakrishna

రేవంత్ రెడ్డి  పాలన అంతా ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారమే జరుగుతుంది

. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్, బతుకమ్మ

రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన అంతా ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారమే జరుగుతుందని  నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ గద్దెనెక్కేందుకే రేవంత్ సర్కారు అమలుకు నోచని హామీలను ఇచ్చారని కవిత అన్నారు. ప్రధానంగా మైనార్టీలకు ఎన్నికల వేళ ఇస్తామని హామీలలో ప్రధానమైన మైనార్టీ డిక్లరేషన్ (చెవేళ్ళ) వెంటనే అమలు చేయాలని డిమాండ్  చేశారు. మైనార్టీల కోసమని బడ్జెట్ లో రూ.7 వేట కోట్లు పెట్టామని చెబుతున్న రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పదేళ్ళ కేసీఆర్ పాలనలో మతకల్లోలల జాడ కనిపించలేదని రేవంత్ సర్కార్ ఏడాది పాలనలోనే ఆందోళన కలిగిస్తుందని అన్నారు. మైనార్టీ యువతీలకు స్కూటిలతో పాటు షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచిందని ఇప్పటికి అమలుకు నోచుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో వందల గురుకులాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని అందులో మైనార్టీ విద్యార్థుల కోసం టిమ్రీస్ ను నెలకొల్పామని ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వాటి పరిస్థితులపై సమీక్షించాలని ముఖ్యమంత్రిని కోరారు. నిజామాబాద్ లో గతంలో మాదిరిగా ప్రశాంత వాతావరణం ఉండేలా  చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా  షబ్బీర్ ఆలీ  పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇంచార్జిగా కొనసాగుతున్న ఇక్కడ  ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా మైనార్టీలున్న నిజామాబాద్ అర్బన్ కు షబ్బీర్ ఆలీ  అదనంగా రూపాయి ఇప్పించలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కవిత కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఇంచార్జి అయేషాఫాతిమా, నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, నగర బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు ఇమ్రాన్ షెహజాజ్, మాజీ జడ్పీటీసీ జగన్ తదితరులు పాల్గొన్నారు.