అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందాలి
పాత పథకాలను యధాతథంగా కొనసాగిస్తాం ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశంలో ఇంచార్జీ మంత్రి జూపల్లి నిజామాబాద్, బతుకమ్మ : పేద, బడుగు, బలహీనవర్గాలకు బాసటగా నిలువాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇంచార్జ్...