విద్యార్థులందరూ అల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలి
. . . అదనపు కలెక్టర్ భుజంగ రావు మాక్లూర్, బతుకమ్మ : విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు అల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులందరూ ఈ మాత్రలు వేసుకోవాలని అదనపు కలెక్టర్ భుజంగ రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మాక్లూర్ మండలం దాస్ నగర్‌లోని మహాత్మ జ్యోతిబా పూలే హైస్కూల్‌లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...