Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2025, 10:00 pm Posted by : ramakrishna

చదువుకు సర్వసమాజ్ ప్రోత్సాహం

  • సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి

 

భీమ్ గల్, బతుకమ్మ : సర్వసమాజ్ గతం లో ఇచ్చిన హామీ మేరకు కస్తూరిబా లో చదువుతున్న స్టూడెంట్స్ కొరకు ప్రోత్సహం అందజేయడం జరుగుతుందని సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి అన్నారు. గురువారం కస్తూరిబా పాఠశాల కు సర్వసమాజ్ ఆధ్వర్యంలో రెండు బెంచీలు , సర్వసమాజ్ ఉపాధ్యక్షులు బర్ల మోహన్ తరపున ఒక బెంచ్ ని విరాళంగా అందించారు. ప్రముఖ వ్యాపార వేత్త కవిత రాజు పాఠశాల కొరకు స్పీకర్ బాక్స్ ను డొనేట్ చేశారు. వీటిని సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుల చేతుల మీదుగా పాఠశాల కు అందజేశారు. ఈ సందర్బంగా నీలం రవి మాట్లాడుతూ గతంలో పాఠశాల ను సందర్శించిన సందర్బంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని, భవిష్యత్తు లో కూడ స్టూడెంట్స్ తో పాటు పాఠశాల అభివృద్ధి కొరకు సహకారం అందజేస్తామని తెలిపారు. దూర ప్రాంతాల్లో నుండి కస్తూరి బా పాఠశాల లో చదువుకునేందుకు వస్తున్న స్టూడెంట్స్ శ్రద్దతో చదువుకుని పాఠశాల కు, కన్న తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని సూచించారు. గిరిజన విద్యార్థుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం తో పాటు పాఠశాల డెవోలోప్మెంట్ కొరకు దాతలు ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు. పాఠశాల కొరకు బెంచీలు, స్పీకర్ అందజేసిన దాతలకు సర్వసమాజ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్వసమాజ్ ఉపాధ్యక్షులు బర్ల మోహన్, కోశాధికారి కాపు కుమ్మరి హరీష్, రైటర్ పర్శ నవీన్, గిరిజన నాయకులు బోర్ లింగం, శర్మ నాయక్, భాధవత్ గోపాల్ నాయక్, తుక్కాజీ నాయక్ తో పాటు కవిత రాజు, బోర్ మోహన్ .డీ. ఎస్ రవి కస్తూరిబా మేడం అనురాధ, టీచర్స్ పాల్గొన్నారు.