. . . చౌట్ పల్లి లో నామిని కి ఎస్ బి ఐ ప్రమాద బీమా చెక్కు అందజేత
కమ్మర్ పల్లి, బతుకమ్మ
ఎస్ బిఐ బ్యాంకులో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరు ప్రమాద బీమా తీసుకోవాలని రీజనల్ మేనేజర్ కొల్లేటి మహేశ్వర్ అన్నారు. కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామానికి చెందిన సట్ట మల్లేష్ ఇటీవలే ప్రమాదవశాత్తు మృతిచెందాడు. మృతుడికి ఎస్ బిఐ చౌట్ పల్లిలో ప్రమాద బీమా ఉండడంతో రూ.20 లక్షల చెక్కును నామిని అయినటువంటి సట్ట లక్ష్మి కి గురువారం రోజున మేనేజర్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్ బి ఐ ప్రమాద బీమా కేవలం రూ.1000 మాత్రమేనని తెలిపి అలాగే బీమా యొక్క ప్రయోజనాలను కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌట్ పల్లి బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్, సిబ్బంది, చౌట్ పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.