కలెక్టరేట్ ముట్టడికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 21 న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నామని, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు....