Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 8:27 pm Posted by : ramakrishna

ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రజలు అందరూ కూడా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని నిజామాబాద్ ఇంచార్జీ మంత్రి సీతక్క అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జాగిర్యాల్ ఎక్స్ రోడ్ నుండి బడా భీంగల్ రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, డ్రంకన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ లాంటి ఉల్లంఘనలు ప్రమాదాలకి కారణమని, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జి సునీల్ కుమార్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ ఏ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి, భీంగల్ సి.ఐ సత్య నారాయణ, ఎస్సైలు తిరుపతి, అనిల్ రెడ్డి, రాము, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

All people should follow road safety rules.
All people should follow road safety rules.